Honey Singh: షారుక్ ఖాన్ తో వివాదం పై స్పందించిన హనీ సింగ్..! 1 d ago
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కు సింగర్ హనీ సింగ్ మధ్య వివాదం నెలకొందని ఎన్నోఏళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రిలీజ్ ఐన "యో యో హనీ సింగ్ ఫేమస్" డాక్యూమెంటరీలో దీనిపై హనీ సింగ్ వివరణ ఇచ్చారు. అమెరికా టూర్ లో షారుక్ ఖాన్ కు నాకు మధ్య గొడవ జరిగిందని వచ్చిన కథనాలను చూసి ఎంతో బాధ పడ్డాను. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అసలు నిజం ఇప్పుడు చెపుతున్నాను. షారుక్ ఖాన్ కు నాకు మంచి అనుబంధం ఉంది. ఆయనకు నేనంటే ఎంతో ఇష్టం.. నాపై ఎన్నడూ చెయ్యి చేసుకోలేదు. మేమిద్దరం కలిసి అమెరికా టూర్ లోకి వెళ్ళాం. అప్పుడు వరుస ఈవెంట్స్ ఉండడం వలన నేను బాగా అలసిపోవడంతో చికాగో ఈవెంట్ ను క్యాన్సిల్ చేయమని మా మేనేజర్ లను కోరాను. అందుకు వాళ్ళు అంగీకరించకపోవడంతో వాష్ రూంకి వెళ్లి తలపై ఒకవైపు జుట్టు మొత్తం కత్తిరించుకొని బయటకి వచ్చాను. ఇలా ఈవెంట్ కు వస్తే బాగోదు కనుక నేను రావడం లేదని చెప్పాను.. నా చేతికి క్యాప్ ఇచ్చి దీనిని పెట్టుకొని రండి అని నిర్వాహకులు అన్నారు. ఇంక ఏంచేయాలో తోచక అక్కడే ఉన్న కాఫి మగ్ తీసుకొని తలపై కొట్టుకున్నాను. దీంతో నా తలపై గాయం ఏర్పడింది. ఇక ఆ సమయంలో షారుఖ్ ఖాన్ నా పై దాడి చేసాడని కధనాలు వచ్చాయి. అయితే వాటిలో ఏ మాత్రం నిజం లేదు అని హనీ సింగ్ తన డాక్యూమెంటరీ లో క్లారిటీ ఇచ్చారు. ఈ పూర్తి డాక్యూమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.